ప్రతి రైతు అర ఎకరంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేయాలి

ప్రతి రైతు అర ఎకరంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేయాలి

కోదాడ, ముద్ర:మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే వానకాలం సీజర్ నుంచి ప్రతి రైతు కూడా తమకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో ఒక అరకరం ప్రకృతి వ్యవసాయం సాగు చేపట్టాలని వ్యవసాయ  సామాజిక కార్యకర్త, రైతు నేస్తం పురస్కారం గ్రహీత మొలుగూరి గోపయ్య (గోపి ) కోరారు. శనివారం చిలుకూరు మండల పరిధిలోని పోలేని గూడెం జర్రిపోతులగూడెం బేతవోలు  కొండాపురం ఆర్లగూడెం  రామపురం గ్రామాలలో  ప్రకృతి వ్యవసాయంపై  స్వచ్ఛందంగా నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో పాల్గొని మాట్లాడారు. రోజు రోజుకి  ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి సోకి అనేకమంది

చనిపోతున్నారన్నారు. దీనికి కారణం మనం రోజు తీసుకునే ఆహారం. పూర్తిగా రసాయనాలతో కూడినటువంటి పంటలను పండించే ఆహారాన్ని తీసుకుంటున్నామని, దీంతో జబ్బుల బారిన పడుతున్నామన్నారు. కాబట్టి ప్రతి రైతు తప్పకుండా అటువంటి భూమిలో ఒక కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరడం జరిగింది. అలాగే భూమి లేని వారు  తమ ఇళ్లల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో పెరటి తోటలు పెంచుకోవాలన్నారు.  ఈ సందర్భంగా నేల పరిరక్షణ, చీడపీడల  నివారణపై సహజ పద్ధతులను రైతులకు  వివరించడం జరిగింది.