వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కసి గుప్తా సేవలే స్ఫూర్తి 

వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కసి గుప్తా సేవలే స్ఫూర్తి 

నేరేడుచర్ల  ముద్ర : వాసవీ క్లబ్ వ్యవస్థాపకులు దివంగత కేసి గుప్తా చేపట్టిన సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని నేరేడుచర్ల వాసవీ వనితా క్లబ్ ల ఆధ్వర్యంలో నిరంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాసవీ వనితా క్లబ్ ల అధ్యక్షులు కొత్తా లక్ష్మణ్ వీరవల్లి శ్రీలతా కోటేశ్వరరావు లు అన్నారు. కేసి గుప్తా జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని మూడవరోజు  జిల్లా కేంద్రం సూర్యాపేట సమీపంలోని దురాజ్ పల్లి అన్నపూర్ణ వృద్ధాశ్రమానికి 25 కేజీల రైస్ బ్యాగును అందజేసిన సందర్భంగా మాట్లాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి , అల్పాదాయ వర్గాల వారికి చేయూతనందించడమే లక్ష్యంగా వాసవి క్లబ్ విశేష రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.

కార్యక్రమంలో వాసవీ వనితా క్లబ్ ప్రధాన కార్యదర్శులు  గజ్జల కోటేశ్వరరావు , పోలిశెట్టి సంధ్య , వనిత క్లబ్ కోశాధికారి యీగా భాగ్యలక్ష్మి, సభ్యులు ఊటుకూరు నటరాజ్, హరి , వాసు , రాము మరియు మెట్టు వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.