తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాలు

తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాలు
  • ఊర ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతీ ఒక్కరికీ కలుగాలి 
  • ప్రభుత్వ కృషి కి తోడు అమ్మవారి ఆశీస్సుల తో తాళ్ళగడ్డ బంగారు గడ్డ అయింది
  • అదుపు లో ఉన్న శాంతి భద్రతల కు తోడు అభివృద్ధి లో ,వ్యాపారరంగాల్లో సూర్యాపేట దూసుకుపోతుంది
  • బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించేలా అమ్మవారిని వేడుకున్నా
  • సూర్యాపేట లోని ని తాళ్ళగడ్డ లో ఘనంగా ఇంద్రవెల్లి ముత్యాలమ్మ బోనాల పండుగ  వేడుకలు
  • ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి తొలి బోనం ఎత్తిన మంత్రి జగదీష్ రెడ్డి
  • ఆలయం లో ప్రత్యేక పూజలో పాల్గొన్న మంత్రి 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ వేడుకలు అని సూర్యాపేట శాసన సభ్యులు , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు.శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ఊర ముత్యాలమ్మ అమ్మవారిఆశీస్సులు ప్రతీ ఒక్కరికీ కలుగాలని మంత్రి ఆకాంక్షించారు.

సూర్యాపేట లో  బోనాల సందడి నెలకొన్నది. తాళ్ళ గడ్డ లో  కొలువైన శ్రీశ్రీశ్రీ  ఇంద్రవెల్లి ముత్యాలమ్మ అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పించారు. కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి  ముఖ్యఅతిథిగా పాల్గొని భైరు దుర్గయ్య  నివాసం లో తొలి బోనం ఎత్తి అనంతరం ఆలయం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామదేవతలను తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతమన్నారు. బోనాల సమయం లో  అమ్మవార్లు తమ పుట్టింటికి వస్తారని ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. అమ్మవారి ఆశీస్సుల తో పాటు , ప్రభుత్వం  చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో  గత పాలకుల హయాం లో అభివృద్ధి కి నోచుకోని తాళ్ళగడ్డ ప్రాంతం బాంగారు గడ్డ గా మారిందని అన్నారు.

అదుపు లో ఉన్న శాంతి భద్రతల కు తోడు అభివృద్ధి లో ,వ్యాపారరంగాల్లో సూర్యాపేట దూసుకుపోతుందన్నారు. ప్రజలకు ఆయుర్ ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి పాడి పంటల తో తులతూగేలా చల్లని ఆశీస్సులు అందజేయాలని,బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించేలా అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.కార్యక్రమం లో  జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మారిపెద్ధి శ్రీనివాస్ గౌడ్, చిరివెళ్ళ శభరి ,భైరు దుర్గయ్య గౌడ్,   బైరు వెంకన్న గౌడ్,రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కక్కిరేని నాగయ్య గౌడ్, బూర బాల సైదులు గౌడ్, అనంతుల యాదగిరి గౌడ్, కటికం శ్రీనివాస్ గౌడ్ దేషగాని శ్రీనివాస్ గౌడ్, పల్స వెంకన్న గౌడ్, గోపగాని వేణు గౌడ్, యల్గురి రాంబాబు గౌడ్, తదితరులు  పాల్గొన్నారు.