అక్రమ వెంచర్లను నిషేధిత జాబితాలో చేర్చాలి

అక్రమ వెంచర్లను నిషేధిత జాబితాలో చేర్చాలి

తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ అధికారులు

హుజూర్ నగర్ టౌన్ ముద్ర: హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారుగా 50 ఎకరాల్లో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి వాటి వల్ల మున్సిపాలిటీకి రావాల్సిన కోట్ల ఆదాయానికి తూట్లు పొడుస్తూ ,10% ల్యాండ్ విషయంలోఇప్పటికే పలుసార్లు మున్సిపల్ కమిషనర్ కి, అడిషనల్ రెవెన్యూ కలెక్టర్లకు కౌన్సిలర్లు ఫిర్యాదు చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని సోమవారం కాంగ్రెస్ కౌన్సిలర్లు కస్తాల శ్రవణ్ , కోతిసంపత్ రెడ్డి జక్కుల వీరయ్య ఆరోపించారు.

గత 20 రోజులు క్రితం అక్రమ వెంచర్లపై మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో అధికారులు జెసిబి సహాయంతో చర్యలు తీసుకున్నా కూడా ఇప్పటికీ నామమాత్రంగానే పనులు జరుగుతున్నాయి. ఈ విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు సమాచారం. అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసిన వ్యాపారులు మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఇలాంటి వెంచర్లలో పేద మధ్యతరగతి ప్రజలు కొని, తర్వాత డిటిసిపి అప్రూవల్ లేకపోవడంతో ఇంటి నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు రాక ఇబ్బంది పడుతున్నారని మున్సిపాలిటీకి రావాల్సిన 10% ల్యాండ్ కూడా రావడం లేదని సమాచారం.