తల్లిపాలే బిడ్డకు కొండంత బలం

తల్లిపాలే బిడ్డకు కొండంత బలం
  • MPP గూడెపు శ్రీనివాస్

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:మండల పరిధిలోని లింగగిరి గ్రామం 1వ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MPP గూడెపు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. తల్లిపాలు బిడ్డకు మంచి పౌష్టిక ఆహారమని, తల్లిపాలు బిడ్డకు కొండంత బలాన్ని ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ హేమ దేవి ,ఏఎన్ఎం విజయలక్ష్మి, కార్యదర్శి సునీత, అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.