ఫర్టిలైజర్స్ డీలర్స్ కార్యవర్గము ఎన్నిక

ఫర్టిలైజర్స్ డీలర్స్ కార్యవర్గము ఎన్నిక

లోకేశ్వరం ముద్ర :లోకేశ్వరం మండల కేంద్రంలో ఫర్టిలైజర్స్ డీలర్స్ కార్యవర్గాన్ని, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.మండల అధ్యక్షులు గా సోమ సుధీర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జె.నారాయణ, కోశాధికారి గన్ను వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సెనగారపు అనిల్, కార్యవర్గ సభ్యులు మిట్టపెల్లి శ్రీనివాస్, గంగారెడ్డి, అశోక్, సాయన్న లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల ఫర్టిలైజర్  అధ్యక్షులు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ లోకేశ్వరం మండల వాసులకు అన్ని రకాల పంటలకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుతామన్నారు మండల ప్రజలు మా యొక్క ఫర్టిలైజర్ షాపులను వినియోగించుకోవాలని  కోరారు రైతులకు అన్ని పంటలకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుతామన్నారు దూర ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని రకాల మందులు మా ఫర్టిలైజర్స్  షాపులలో లభిస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన ఫర్టిలైజర్స్ డీలర్ లు పాల్గొన్నారు.