షార్ట్ సర్క్యూట్ తో వైన్స్ దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో వైన్స్ దగ్ధం

- రూ.10 లక్షల నష్టం

ముద్ర ప్రతినిధి,నిర్మల్: నిర్మల్ పట్టణంలో సోమవారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో వైన్స్ దగ్ధమైంది. స్థానిక మార్కెట్ కమిటీ సమీపంలోని లక్కీ వైన్స్ లో ఈ ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం సమయంలో వైన్స్ నుంచి పొగలు రావటం చూసిన స్థానికులు అందించిన సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సామగ్రి తో పాటు మద్యం బాటిళ్లు కాలిపోయాయి. దాదాపు రూ. 10 లక్షల మేర నష్టం జరిగినట్లు అంచనా.