తెలంగాణ వచ్చినప్పటికీ మారని  చాకలి బతుకులు

తెలంగాణ వచ్చినప్పటికీ మారని  చాకలి బతుకులు

చాకలి sc సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సట్టు నాగయ్య

 ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: చాకలి ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక రైతు బజార్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద చాకలి sc సాధన సమితి 6వ వార్షికోత్సవ మహా సభ కరపత్రం మంగళవారం ఆవిష్కరించారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా రజకుల బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వుందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కూడా రజకుల బ్రతుకులు మారలేదన్నారు. ఉద్యమ రూపంలో గద్దెనెక్కిన కేసీఆర్ చాకలి జాతి గురించి, చాకలి జాతి కష్టాల గురించి తెలియదా? అని ప్రశ్నించారు. కరీంనగర్ సభలో హరీష్ రావు రజకుల ఎస్సీ జాబితా గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తా అన్నారు.

మరి సీఎం కూడా పరిశీలిస్తామన్నారని,ఇంకా ఎంతకాలం కాలయాపన చేస్తారనీ, ఎన్ని ఏళ్ళు పరిశీలిస్తారనీ ప్రశ్నించారు. నిన్నగాక మొన్న కులవృత్తుల వారికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారని, రజక ఫెడరేషన్ కి 450 కోట్లు కేటాయించి తొమ్మిది సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా ఇప్పుడు కులవృత్తులకి లక్ష రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్తే నమ్మి స్థితిలో లేమని అన్నారు.  మాయమాటలు, గారడి చేస్టలు ఇక సాగవన్నారు.  తమ చిరకాల వాంఛ sc రిజర్వేషన్ కల్పించకపోతే  ఖచ్చితంగా ఫామ్ హౌజ్ పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. ఈ నెల 28 వ తారీకున సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైద్రాబాద్ లో జరిగే  6వ వార్షికోత్సవ మహా సభకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో రజకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చాకలి ఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు భూతరాజు ఉపేందర్, జిల్లా నాయకులు అక్కినపల్లి శ్రీను, పట్టణ ఉపాధ్యక్షులు ఏనుగంటి లింగయ్య, జిల్లా మహిళా నాయకురాలు భూతరాజు శైలజ,పట్టణ మహిళా నాయకురాలు తాడూరి పద్మ, సట్టు నీలిమ, ఎల్లుట్ల సైదమ్మ, రాచూరి సంధ్య, అఖిల తదితరులు పాల్గొన్నారు.