బెజ్జంకి మండలంలో పనులపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్

బెజ్జంకి మండలంలో పనులపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్

మన ఊరు మన బడి పథకం అమలుపై కలెక్టర్ సమీక్ష

సిద్దిపేట : ముద్ర ప్రతి నిధి :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పరిది లో ఉన్న బెజ్జంకి మండలంలో అమలు చేస్తున్న 'మన ఊరు మన బడి' పథకంఫైన జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో నిర్వహించిన ఈ సమాసానికి బెజ్జంకి మండల పాఠశాలల హెచ్ ఎం, ఎస్ఎంఎసి చైర్మన్లు, ఎంఈవో, ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈలు సర్పంచ్, కౌన్సిలర్లు, నిర్మాణ ఏజెన్సీల వారు హాజరయ్యారు
ఈ సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ  హుస్నాబాద్ నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథక పనులు నత్తనడకన సాగుతున్నందున అసహనం వ్యక్తం చేశారు.బెజ్జంకి మండలంలో ఇంకా మెరుగుపర్చు పోవాలని అధికారుల ఆదేశించారు.ఈ పథకంలో ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్ మైనర్ (కిటికీలు, డోర్లు, స్లాప్, ఫ్లోర్) రిపేర్లు తప్పని సరిగా వేగంగా పూర్తి చేసి కలరింగ్ కు నమోదు చేసుకోవాలనికోరారు.

ఎన్ఆర్ఈజిఎస్, ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షేడ్ పూర్తి చేశాకే మిగతా ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు పూర్తి చెయ్యాలని. ఎంపిడిఓ,ఎంపిఓ లు రోజు వారిగా పాఠశాలల్లో జరుగుతున్న ఈజీఎస్ పనులను పర్యవేక్షణ చేసి పూర్తి చేయించాలనికోరారు. పాఠశాల పేరును స్టిల్స్ కలర్ మాదిరిగా ఉండె బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు.  ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీలు పనులు పూర్తి అయిన తర్వాత పాఠశాల లోపల కాని బయట మైదానంలో కాని ఎలాంటి చెత్త, చెదారం,పాత సామాను,రాళ్ళు, రప్పలు లాంటివి ఎలాంటివి ఉండకూండ శుభ్రంగా ఉంచాలని సూచించారు.భవనం అన్ని సదుపాయాలు కల్పించి రంగులు వేస్తే సరిపోదు పాఠశాలల్లో సేవింగ్స్ ఉంటే మైదానంలో సుందరీకరణ చేయ్యాలి మంచి గేట్, పైన ఆర్చ్ మైదానంలో కొంత గడ్డి కార్పెట్ పరచాలి మెట్లకి గ్రానైట్ పెట్టుకోవాలని సూచించారు.ఎఈలు ఇప్పటి వరకు అయిన పనులకు ఎప్టిఓ జనరేట్ చెయ్యాలి మరియు కలరింగ్ ఏజెన్సీ కి మెథర్ మెంట్ షిట్ అందించారు.ఎంపిడిఒ,ఎంపిఓలు, ఏఈలకు తోడ్పాటు అందించాలని కోరారు. మళ్లీ సమావేశంలోపు పనుల్లో వేగం పెంచి పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డి, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ రాములు  పాల్గొన్నారు.