కెసిఆర్ రాష్ట్ర అభివృద్ధి .. ఇతర రాష్ట్రాలకు దిక్సూచి..

కెసిఆర్ రాష్ట్ర అభివృద్ధి .. ఇతర రాష్ట్రాలకు దిక్సూచి..
  • వచ్చే ఎన్నికల్లో దుబ్బాక గెలుపు మనదే
  • బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి 

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: దేశం గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి పథంలో నడుపుతున్నారని సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు చూసి పక్క రాష్ట్రాలు కాపీ కొడుతున్నయని ఆయన చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం దుబ్బాక నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి, బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కే ఆర్ ఆర్ గార్డెన్లో జరిగిన ప్లీనరీ సభలో పాల్గొని ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. దుబ్బాక ప్రజలు చైతన్యం కలిగిన వారని, మొదటి నుంచి బీఆర్ఎస్ అడ్డ దుబ్బాక గడ్డ అనే విధంగా కెసిఆర్ తో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. ఈ రోజు ప్లీనరీ సభకు వచ్చిన కార్యకర్తల ఉత్సాహం చూస్తే గెలుపు వచ్చే ఎన్నికల్లో దుబ్బాక లో  బీఆర్ఎస్ కాయం అని తేలిపోయిందన్నారు.  ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు రఘునందన్ రావును నమ్మి మోస పోయారని, మాయమాటలు చెప్పి మోసం చేసిన రఘునందన్ ను ఇక నమ్మవద్దని సూచించారు. కెసిఆర్ ఏ రాష్ట్రంలో బీఆర్ఎస్ మీటింగు పెట్టిన ఫుల్ సక్సెస్ అవుతుందని రానున్న రోజుల్లో దేశంలో అధికారంలోకి వస్తే తెలంగాణ తరహా అభివృద్ధి జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో, నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరే వరకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని అభ్యర్ధించారు. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవ్వరికీ ఏ ఆపద వచ్చినా నేను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మనమంతా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా పని చేద్దాం అన్నారు.  వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరే వరకు పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని సూచించారు. అనంతరం ప్లీనరీలో పలు తీర్మానాలు ప్రవేశ  పెట్టి ఆమోదించారు. ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్, మాజీ ఎమ్మెల్సీ బోడ కుంటి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకులు రొట్టె రాజమౌళి, బక్కి వెంకటయ్య, కడతల రవీందర్ రెడ్డి, గన్నె వనితా భూమిరెడ్డి ,తోట కమలాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, నామినేటెడ్ కమిటీల చైర్మన్లు, మండల పార్టీ గ్రామ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.