వడపర్తి గ్రామంలో సర్వేనెంబర్ 126 లో ప్రభుత్వ భూమిలో హద్దులు పాతాలి

వడపర్తి గ్రామంలో సర్వేనెంబర్ 126 లో ప్రభుత్వ భూమిలో హద్దులు పాతాలి
  • ప్రభుత్వ భూమిని కాపాడాలి మనేరు పంపు హనుమాన్ గుడి వరకు రోడ్డు వేయాలి

భువనగిరి ఆగస్టు 25 (ముద్ర న్యూస్):- భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో సర్వేనెంబర్ 126 లో ఉన్న ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ స్థలాన్ని హద్దులు గుర్తించి ఎకరం భూమిని కాపాడాలని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో వినతి పత్రం వడపర్తి సర్పంచ్ ఎలిమినేట్ కృష్ణారెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సర్వేనెంబర్ 126 లో ఒక ఎకరం ప్రభుత్వ భూమికి హద్దులు బాండీస్ గుర్తించి కాపాడాలని కోరారు అదేవిధంగా మన్నేవారి పంపు గ్రామం నుంచి వడపర్తి హనుమాన్ గుడి వరకు రోడ్డు వెయ్యాలని ప్రభుత్వ బాటని  తీసి గ్రామస్తులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి నరసింహ ఎస్ నరసింహ రవీందర్ రెడ్డి మల్లయ్య ఇత్తారి కృష్ణ ఆనంద్ మహేష్ రమేష్ పసర్ బాబా తదితరులు పాల్గొన్నారు.