లింగన్న నిరంతరం ప్రజల గుండెల్లో చిరంజీవిగా ఉంటాడు.....

లింగన్న నిరంతరం ప్రజల గుండెల్లో చిరంజీవిగా ఉంటాడు.....
  • సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుల వెల్లడి.....

ఆలేరు (ముద్ర న్యూస్):సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు. విప్లవ ప్రతిఘటన ఉద్యమ అజ్ఞాత వీరుడు అమరుడు పునేం లింగన్న నో 2019లో బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపినప్పటికీ ఆయన నిరంతరం ప్రజల హృదయాలలో చిరంజీవిగా నిలిచి ఉంటారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్ అన్నారు. సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో లింగన్న నాలుగవ వర్ధంతి కార్యక్రమానికి డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ అధ్యక్షతన జరగగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పునెం లింగన్న దేశంలో. రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థ. భూస్వామ్య విధానం అంతం కోసం. అసమానతలు. అన్యాయం లేని నవ సమాజం కోసం ప్రజలను విముక్తి చేయడంలో అనేక పోరాటాలను నిర్వహించారని గుర్తు చేశారు. అడవిని నమ్ముకుని బ్రతుకుతున్న ఆదివాసి. గిరిజన. అడవి ప్రాంతాలలో జీవిస్తున్న ప్రజలకు లింగన్న ప్రాణప్రదంగా కలిసి జీవించారని తెలిపారు. పోడు భూములు తప్ప మరే ఇతర ఆదేరువులేని అడవి బిడ్డలను ప్రజా పోడు పోరాటం ద్వారా వేలాది ఎకరాల భూములను సాధించి పెట్టిన లింగన్నను.

ప్రజా ఉద్యమాలను సహించలేని దోపిడి పాలకవర్గాలు ఆయన అంతం కోసం అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వలేని ఆదివాసి. గిరిజన వ్యతిరేకి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం 2019లో సజీవంగా పట్టుకొని. చిత్రహింసలకు గురిచేసి. బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపడం ప్రజా ద్రోహం అని ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలపై మండిపడ్డారు. మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసి అడవి ప్రజలపై. మహిళలపై అఘాయిత్యాలు. అత్యాచారాలు. వివస్త్రతలను చేసి ఊరేగించడం. హత్యలు చేయడం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలలో భాగమేనని ఆరోపించారు. భారత్ మాతాకీ జై నినాదం. బేటి బచావో. బేటి పడావో అనే నినాదం బట్టి బూటకం అని అన్నారు. ఇది ప్రజలను నమ్మించి. మరో మారు మోసం చేయడం లో భాగమేనని చెప్పారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎన్నికల ఎత్తుగడ తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని అన్నారు. మణిపూర్ ఘటన యావత్ ప్రపంచానికి బిజెపి. ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపాలను బయటపెట్టిందని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలను. హిందూ మతం పేరుతో సాగిస్తున్న హంతక చర్యలు. దాడులను సమర్ధవంతంగా బలమైన ప్రజా ఉద్యమాలతో తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు. ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఆర్ సీత. పద్మ సుదర్శన్. తమ్మడి అంజయ్య. పాకాల నరేష్. ఆర్ ఉదయ్. పాకాల చిన్నారులు. తదితరులు పాల్గొన్నారు.....