శేఖర్ అన్న మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో ఏది అడిగినా చేస్తా : కేటీఆర్ 

శేఖర్ అన్న మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో ఏది అడిగినా చేస్తా : కేటీఆర్ 

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అంటే తనకు ప్రత్యేకమైన ప్రేమ అని ఆయన ఏది అడిగినా తప్పకుండా చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

శనివారం భూదాన్ పోచంపల్లి లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ శేఖర్ అన్న పై ఉన్న ప్రత్యేక ప్రేమతో ఏది అడిగిన చేస్తానని చెప్పారు. నియోజకవర్గ ప్రజల కోసం ఎంతో తపన పడతారని అన్నారు. రాబోయే ఎన్నికలలో శేఖర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.