గౌడ సంఘ భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేసిన బీర్ల..

గౌడ సంఘ భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేసిన బీర్ల..

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక. రాఘవపురం గ్రామాలలో గౌడ కుల సంఘ భవన నిర్మాణానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి మరియు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీ గంగమల్ల అశోక్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వరరాజు. రాఘవపురం ఎంపీటీసీ సభ్యులు ఆరే ప్రశాంత్ గౌడ్. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు. గౌడ సంఘం నేతలు. తదితరులు పాల్గొన్నారు.