జయశంకర్ ఆశయాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం..

జయశంకర్ ఆశయాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం..
  • బిజెపి ఆరోపణ..

ఆలేరు (ముద్ర న్యూస్):సమైక్య ఆంధ్ర పాలకుల దోపిడీ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయడం కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిరంతరం ప్రజలలో రగిలిస్తూ ప్రత్యేక తెలంగాణ సాధించిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను. కలలను సాకారం చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బిజెపి నాయకులు ఆరోపించారు. ఆదివారం నాడు జయశంకర్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉద్యోగం. ఉపాధి అవకాశాలు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలోని భూములకు నీరందే విధంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ నిరంతరం కృషిచేసిన మహనీయుని ఆశయాలను అమలు చేయడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్. నాయకులు సముద్రాల శ్రీనివాస్. కటకం నందం. తోట మల్లయ్య. జేట్ట సిద్దులు. కళ్లెం రాజు. కటకం వెంకటేష్. బందెల సుభాష్. అయిలీ సందీప్. పులిపలుపుల మహేష్. కటకం రాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.