రానున్న ఎన్నికలలో కేంద్రంలో. రాష్ట్రంలో బిజెపి గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం..

రానున్న ఎన్నికలలో కేంద్రంలో. రాష్ట్రంలో బిజెపి గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం..

ఆలేరు (ముద్ర న్యూస్):కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 9 సంవత్సరాలలో ప్రజల కోసం అందిస్తున్న సేవా కార్యక్రమాలు. సంక్షేమ పథకాలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తాయని బిజెపి పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్ అన్నారు. సోమవారం నాడు బిజెపి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సంపర్కు అభియాన్ కార్యక్రమం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని 108వ బూతులో గల ఇంటింటికి. వాణిజ్య కేంద్రాలకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణలను వివరించారు. బిజెపి ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల ద్వారా దేశంలో. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాలు ఏర్పడి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు అమృతం నరసింహ. పట్టణ ఉపాధ్యక్షులు ఎలగందుల రమేష్. జెట్ట సిద్దులు. ప్రధాన కార్యదర్శి పులిపలుపుల మహేష్. కటకం రాజు. దళిత మోర్చా పక్కన అధ్యక్షులు ఫస్తం ఆంజనేయులు. కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు నంద గంగేష్. సీనియర్ నాయకులు కటకం నందం. బందెల సుభాష్. పత్తి రాములు. యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేష్. పూల హనుమంతు. పాలిటిక్స్ శ్రీధర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.