రైతు పక్షపాతి ప్రధాని నరేంద్ర మోడీ...

రైతు పక్షపాతి ప్రధాని నరేంద్ర మోడీ...
  • రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి విడుదల పట్ల హర్షం...
  • వచ్చే ఐదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం 
  • మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్, పి.వి. శ్యామ్ సుందర్ రావు

ముద్ర ప్రతినిధి భువనగిరి :ప్రధాని నరేంద్ర మోడీ రైతు పక్షపాతి అని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రం భువనగిరి గంజ్ లో పొద్దుటూరి రాజేశ్వర్ ఫర్టిలైజర్ షాపు వద్ద కిసాన్ సన్మాన్ నిధి విడుదల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ లో కార్యకర్తలు, రైతులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు 8.5 కోట్ల మంది రైతులకు 14వ విడత కిసాన్ సన్మాన్ నిధి కింద మొత్తం 17వేల కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అలాగే భారత రైతాంగానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చాలని ఉద్దేశంతో  2236 రూపాయల సబ్సిడీ భరిస్తూ కేవలం 267 రుపాయలకు ఒక యూరియా బస్తా, 2422 రూపాయల సబ్సిడీ భరిస్తూ కేవలం 1350 రూపాయలతో డి. ఎ. పి బస్తా కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తుందని అన్నారు.

బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ రూపంలో సాగు చేసే ప్రతి రైతుకు ఎకరాకు సరాసరి 6 వేల రూపాయలు అందిస్తోందని, అంతే గాక ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు కిసాన్ సమ్మాన్ పేరుతో సాలీనా 6 వేల రూపాయలు అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైతులకు ఇచ్చే సబ్సిడీలు ఇవ్వడం మానివేయడమే గాకుండా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం దేశ వ్యాప్తంగా ఇచ్చే సబ్సిడీ తో కూడిన వ్యవసాయ పరికరాల స్కీమ్ రాష్ట్రంలో అమలు కాకుండా అడ్డుకుంటున్నారని  విమర్శించారు. రైతు బంధు  ఒట్లు కొల్లగొట్టడానికి ప్రవేశపెట్టినదని, భూస్వాములకు, పారిశ్రామిక వేత్తలకు దోచి పెట్టే స్కీమ్ అని ఆయన విమర్శించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు పండిన ప్రతి గింజ కోంటున్న మోడి ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో నాగర్జున ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు గంగిశెట్టి శ్రీకాంత్, సాంబశివరెడ్డి, లీలా ప్రసాద్, షాపు యజమాని పొద్దుటూరి శ్రీనివాస్ & బ్రదర్స్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పోతంశెట్టి రవీందర్, నారాయణరెడ్డి, దాసరి మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, జగన్మోహన్ రెడ్డి, మాయ దశరథ, ఉమాశంకర్, పట్నం శ్రీనివాస్, చందా మహేందర్ గుప్తా, పిట్టల అశోక్, మెహమూద్, చిట్టిపోలు శ్రీధర్, ఏ.లక్ష్మణ్, వేణు మాధవ్, వై సంతోష్, వి నగేష్, వి అశోక్  పాల్గొన్నారు.