భువనగిరి కలెక్టరేట్ లో దారుణం...

  • ప్రియుడిని కత్తితో పొడిచిన ప్రియురాలు..
  • ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే..

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి కలెక్టరేట్ లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిని కత్తితో పొడిచిన ప్రియురాలు. వివరాలు ఇలా ఉన్నాయి. వ్యవసాయ శాఖలో శిల్ప, మనోజ్ లు పనిచేస్తున్నారు. శిల్ప కు సుధీర్ అనే వ్యక్తి 2012 వివాహం జరిగింది..ఒక బాబు ఉన్నాడు. రెండు సంవత్సరాల నుంచి భర్త కు దూరంగా ఉంటు మనోజ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సమాచారం. శిల్ప ఆత్మకూరు మండల వ్యవసాయ శాఖ అధికారిగా పని చేస్తోండగా, మనోజ్ యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట ఏఈఓ పని చేస్తున్నారు. రెండు నెలల నుంచి  మనోజ్ లివ్ పెట్టి వెళ్ళి శిల్పను కలవకుండా తిరుగుతూ తన సెలవులను పొడిగించుట కొరకు శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంకు వచ్చాడు. మనోజ్ వచ్చిన  సమాచారం తెలుసుకొని శిల్పా కలెక్టరేట్ కి వచ్చి మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య మాటమాట పెరిగి మనోజ్ కత్తి తో దాడి చేయబోగా శిల్పా దాడిని అడ్డుకొని అదే కత్తి తో మనోజ్ పైన దాడి చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని  మనోజ్ నీ అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.