మరణంలో మరో ముగ్గురికి ప్రాణదానం చేసిన ఉత్తముడు.

మరణంలో మరో ముగ్గురికి ప్రాణదానం చేసిన ఉత్తముడు.

ముద్ర ప్రతినిధి భువనగిరి : మనిషి మరణించిన అనంతరం మరో ముగ్గురికి ప్రాణదానం చేసి వారి ప్రాణాలు కాపాడిన మహోన్నతుడు, ఉత్తముడిని ఆ ముగ్గురు ఎప్పటికీ మర్చిపోలేనీ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం లోని మన్నెవారిపంపు గ్రామానికి చెందిన మెడబోయిన పెంటయ్య (61) గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. అందరి వివాహాలు చేశాడు. ఈ క్రమంలో అక్టోబర్ 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో అనుకోకుండా కూసున్న స్థలంలోనే కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే లేపి చూడగా మూతి వంకర పోవడంతో పాటు కుడికాలు, పొడిచేయి, కదిలించిన కదలకపోవడం, ఎంత పిలిచినా పలక పోవడంతో సమీపంలోని భువనగిరిలోని ప్రవేటు హాస్పిటల్ కి తరలించారు. వైద్యుల పరీక్ష అనంతరం మెరుగైన వైద్యం కోసం, డాక్టర్ల సూచన మేరకు సికిందరాబాద్ లో ని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. గత నాలుగు రోజుల నుంచి చికిత్స పొందుతుండగా బుధవారం ఉదయం 11.03 గంటల సమయంలో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. చేసేదేమీ లేక కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ క్రమంలో వైద్యులు తెలంగాణ జీవన్ దాన్ సమస్త కు అవయవదానం చేయాలని సూచించారు.    

తెలంగాణ జీవన్ దాన్ సంస్థకు అవయవ దానం                      

సికింద్రాబాద్లోని యశోద దవఖానలో బ్రెయిన్ డెడ్ తో మృతి చెందిన మెడబోయిన పెంటయ్య కుటుంబ సభ్యులను దవాఖాన వైద్యులు అవయవ దానం చేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు.  దీంతో పెంటయ్య శరీరంలోని కిడ్నీలు, లివర్, కంటి లేయర్ ను తెలంగాణ జీవన్ దాన్ సంస్థ సభ్యులు సంబంధిత అవయవాలను తీసుకున్నారు.. దీంతో మృతి చెందిన పెంటయ్య అవయవ దానం చేయడంతో ఆ అవయవాలు మరో ముగ్గురికి పెట్టడంతో  ఆయన ఇచ్చిన అవయవాలతో మరో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన మృతుడు పెంటయ్య భార్య సుశీల, పెద్ద కుమారుడు శంకర్, చిన్న కుమారుడు బాలకృష్ణ, కూతురు బాలమణి, అల్లుడు కృష్ణ ని వైద్యులు, జీవన్ దాన్ సమస్త సభ్యులు అభినందించారు. విక్రమంలో బుధవారం సాయంత్రం గ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.