తెలంగాణ ద్రోహి... కాంగ్రెస్ - దశాబ్దాలుగా అన్యాయ -కేటీఆర్    

తెలంగాణ ద్రోహి... కాంగ్రెస్ - దశాబ్దాలుగా అన్యాయ -కేటీఆర్    

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ  ద్రోహి కాంగ్రెస్ అని, దశాబ్దాలుగా తెలంగాణ కు అన్యాయం చేస్తున్నారని బిఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బుధవారం కామారెడ్డి నియోజకవర్గంలో ని భిక్కనూర్, రాజంపేట లో జరిగిన సభలో మాట్లాడారు.   ఆనాడు జవహర్ లాల్ నెహ్రు వల్ల తెలంగాణ ను ఆంధ్ర లో కలిపారని అన్నారు. ఇందిరాగాంధీల వల్ల తెలంగాణ కు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. వందల మంది అమరవీరులకు సోనియా గాంధీ బలితీసుకున్నారని అన్నారు. నేడు తెలంగాణను అభివృద్ధి చేస్తామంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.

గతంలో షబ్బీర్ అలీని, ప్రస్తుతం రేవంత్ రెడ్డిని... ఎవరొచ్చినా గంప కింద కమ్ముతాని అన్నారు.  ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరిక మేరకు, ఇక్కడ అభివృద్ధి కోసమే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటి చేస్తున్నారని, 9న జరిగే నామినేషన్ సభకు ప్రతీ ఇంటి నుంచి తరలి రావాలని అన్నారు. ఇతర పార్టీల నుంచి పోటి చేస్తున్న అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకోండని కానీ కేసీఆర్ కు ఓటు వేయండని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని తిట్టి తర్వాత ఆ పార్టీలోకి చేరి పొగుడుతున్నారని అన్నారు.  55 ఏళ్లలో కాంగ్రెస్ పాలించి, రాష్ర్టాన్ని, దేశాన్ని అంధకారం లో నెట్టిందని అన్నారు. కేవలం రూ.200 ఫించన్ ఇవ్వగా, తాము 2వేల ఫించన్ ఇస్తున్నామని అన్నారు. రైతులను బిచ్చగాళ్లని రేవంత్ రెడ్డి అంటున్నారని, తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారని, ఇక్కడి నాయకులకు దమ్ము లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బిఆరెస్ జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.