చెవులో పూలు పెట్టుకొని  వినూత్న నిరసన తెలిపిన వoట కార్మికులు..

చెవులో పూలు పెట్టుకొని  వినూత్న నిరసన తెలిపిన వoట కార్మికులు..
  • మధ్యాహ్న భోజన వంట కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదు
  • ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్

ముద్ర ప్రతినిధి భువనగిరి : మధ్యాహ్న భోజన వంట కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం  తగదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ఆరోపించారు. శనివారం  మధ్యాహ్న భోజన వంట కార్మికులకు రావలసిన బకాయిలు చెల్లించాలని  రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవదిక సమ్మె 11వ రోజు భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చెవిలో పూలు పెట్టుకుని  ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా  ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన వంట కార్మికులకు పెంచిన వేతనాలు పెండింగ్ బిల్లులు విడుదల చేసామని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి గారు  పత్రికలలో స్టేట్ మెంట్  ఇచ్చి  4 రోజులు కావొస్తున్న నేటికీ కార్మికుల బ్యాంక్ ఖాతాలలో పూర్తిగా డబ్బులు రాలేదని అయన అన్నారు. అందరి బ్యాంక్ ఖాతాలో డబ్బులు వచ్చే వరకు సమ్మె యధావిధిగా కొనసాగుతుందని అయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకోవాలనే ఆలోచన ఉంది తప్ప,  కార్మికులకు మేలు చేసే ఆలోచన ప్రభుత్వ వద్ద కనపడటం లేదని అని ఆరోపించారు. నూతనంగా జారీ చేసిన మెనూ ప్రకారం వంటలు చేయాలంటే కనీసం ప్రతి కార్మికునికి రూ.26,000/- ఇవ్వాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, మధ్యాహ్న భోజన వంట కార్మికుల జిల్లా అధ్యక్షురాలు బాగుల వసంత, ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, ఉపాధ్యక్షులు జిన్న కృష్ణ  నాయకులు నిర్మల, సంధ్య, లక్ష్మీ, స్వప్న, అనసూర్య, శ్యామ్, అండాలు, వాణి, కృష్ణవేణి, లలిత, సుగుణ  పాల్గొన్నారు.