మైనింగ్ మాఫియా కు అడ్డుకట్ట వెయ్యాలి

మైనింగ్ మాఫియా కు అడ్డుకట్ట వెయ్యాలి

ముద్ర,హుజురాబాద్: సర్వాయి పాపన్న  గుట్టలపై  జరుగుతున్న మైనింగ్ మాఫియా కు ప్రభుత్వం వెంటనే అడ్డుకట్ట వేయాలని  సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. క్వారీ అనుమతులను రద్దు చేసి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరుతూ  శనివారం పట్టణంలో ని  సర్వాయి పాపన్న విగ్రహం నుంచి  ఆర్డీవో కార్యాలయం వరకు గీత కార్మిక సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ  సర్వాయి పాపన్న గుట్టలు  భీమదేవరపల్లి, హుస్నాబాద్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని, వాటిపై వారి నిర్వహించటం మూలంగా పర్యావరణకు హాని కలుగుతోందని  పేర్కొన్నారు. మైనింగ్  మాఫియా పై కఠిన చర్యలు తీసుకొని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం బాధ్యులు సింగం సత్యన్న గౌడ్, ఘనగాని సత్యనారాయణ గౌడ్,మార్క అనిల్ గౌడ్,గోపగోని సారయ్య గౌడ్,కోడూరి పరుశరాములు గౌడ్,  మేడగోని బుచ్చయ్య గౌడ్,ముత్యం శంకర్ గౌడ్,పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్,సాయిలు గౌడ్,బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్,తాళ్లపల్లి రమేష్ గౌడ్,పెరమండ్ల సదయ్య గౌడ్,మెడగొని శ్రీనివాస్ గౌడ్,కుమార్ గౌడ్, పంజాల రామ్ శంకర్,  తదితరులు  ఉన్నారు.