భువనగిరిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి 

భువనగిరిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి 

భువనగిరి జూలై 24 (ముద్ర న్యూస్):-యాదాద్రి భువనగిరి జిల్లా కు మంజూరైనా మెడికల్ కాలేజీ ను యాదగిరి గుట్ట లో కాకుండా భువనగిరి లో ఏర్పాటు చేయాలని భువనగిరి పట్టణం లోని అంబేద్కర్ చారస్తా వద్ద కళాశాల విద్యార్థులతో కలిసి వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లా కు మంజూరైనా మెడికల్ కాలేజీ జిల్లా కేంద్రం భువనగిరి లో కాకుండా యాదగిరి గుట్ట లో ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మౌనం వీడి కాలేజీ ఏర్పాటు కు ముఖ్యమంత్రి తో మాట్లాడాలని లేనియెడల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.