మణిపూర్ లో రాజకీయ లబ్ధి కోసమే చిచ్చు

మణిపూర్ లో రాజకీయ లబ్ధి కోసమే చిచ్చు
  • మణిపూర్ లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలి
  • దయ్యాల నరసింహ సిపిఎం మండల కార్యదర్శి

భువనగిరి జూలై 24 (ముద్ర న్యూస్):- మణిపూర్ లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హనుమపురం వడపర్తి గ్రామంలో ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేయడం జరిగింది .ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని నరసింహ మాట్లాడుతూ మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి అన్నారు .కుకీ తెగకు చెందిన ఆదివాసి మహిళలను ఇద్దరినీ నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారం చేసి ,హత్య చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు .బిజెపి పరిపాలిస్తున్న  రాష్ట్రంలో గిరిజన ఆదివాసీల్లో మైనారిటీలపై అనేక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.మణిపూర్ రాష్ట్ర జనాభాలో 54 శాతానికి పైగా ఉన్న మైతి కులస్తులకు కుక్కి ,నాగ గిరిజన తెగల మధ్య బిజెపి తన రాజకీయ లబ్ధి కోసం చిచ్చు పెట్టిందని ఆరోపించారు. గిరిజన చట్టాలను అతిక్రమించి మైత్రి లను గిరిజనలుగా మార్చడానికి ఒడిగట్టిందన్నారు. ఆదివాసీలను అడవుల నుండి దూరం చేసే కుట్రలు చేస్తుందని విమర్శించారు .దీని ప్రతిఘటించిన కుకి, నాగ తెగలపై మతోన్మాద శక్తులు.బిజెపి అండతో గత రెండున్నర నెలలుగా తీవ్రమైన దాడులకు తెగబడుతున్నాయని వివరించారు. ఇండ్లు, చర్చిలు, ప్రజల ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని, అనేకమంది ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. డబ్బులు ఇంజన్ బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ హింసాత్మక ఘటనలకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ,దోషులను శిక్షించి ,బాధితులకు న్యాయం చేయాలని నరసింహ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శిలు మోటే ఎల్లయ్య ,పాండాల మైసయ్య రాగాల రాజేశ్వర్ , రంగ నారాయణ ,దుర్గం నరసింహ ,సేవర్తి బాల నరసింహ ,పి .భాగ్యమ్మ ,జే .పద్మ, ఎస్. కవిత ,ఎస్కే షానూర్ బి , ఎం ఐలమ్మ, రాజేశ్వరి ,కవిత ,అర్చన తదితరులు పాల్గొన్నారు.