వంగపల్లి  హైవేపై రోడ్డు ప్రమాదం డ్రైవర్ అయిలయ్య మృతి

వంగపల్లి  హైవేపై రోడ్డు ప్రమాదం డ్రైవర్ అయిలయ్య మృతి
Driver Ailaiah died in a road accident on Vangapally highway

యాదగిరిగుట్ట (ముద్రన్యూస్)యాదగిరిగుట్ట మండల వంగపల్లి సమీపం వద్ద జాతీయ రహదారి పై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్రాక్టర్ ను ఓ లారీ  ఢీ కొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భువనగిరి మండలం కేసారం గ్రామానికి చెందిన కాశపాక ఐలయ్యగా గుర్తించారు.

వరంగల్  హైదరాబాద్ 163 వ జాతీయ రహదారి వంగపల్లి  సమీపంలో రోడ్డు మధ్యలో మొక్కలకు నీళ్లు పోసే వాటర్ ట్రాక్టర్ ను  ఇసుక లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. గతం లో ఆలేరు వద్ద  రోడ్డు మధ్యలో చెట్లు నాటుతున్న కూలీలను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు నలుగురు దుర్మరణమైనా  కాంట్రాక్టర్ పద్దతి మారలేదు.