యాదగిరిగుట్టలో యాదవ సత్రం ఏర్పాటుకు కృషి

యాదగిరిగుట్టలో యాదవ సత్రం ఏర్పాటుకు కృషి
  • జిల్లా అధ్యక్షుడు పుట్ట వీరేశ్​ యాదవ్

భువనగిరి, ముద్ర : యాదగిరిగుట్టలో యాదవ సత్రం ఏర్పాటుకు కృషి చేస్తానని శ్రీకృష్ణ యాదవ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పుట్ట వీరేశ్​ యాదవ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ సంఘం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యాదవులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుదలకు ఈ కమిటీ పని చేస్తుందన్నారు. యాదవ సత్రం ఏర్పాటుకు మంత్రులను ఎమ్మెల్యేలను కలిసి సహకరించమని కోరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిరమైన వెంకటేష్ యాదవ్, నాయకులు మేకల బాలకృష్ణ యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్, జక్కుల వెంకటేశ్ యాదవ్, పోతుల వెంకటేష్ యాదవ్, దండే బోయిన వీరేశం యాదవ్, గుండేటి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.