మన  సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకోవాలి.

మన  సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకోవాలి.
  • మూన్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి.
  • ప్రజాభారతి స్వచ్చంద సంస్థ సేవలు  అభినందనీయం.
  • ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ,జి లక్ష్మీనరసింహారెడ్డి.

మోత్కూర్(ముద్ర న్యూస్):తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలు వారు అనుసరించేందుకు వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోత్కూరు పురపాలక చైర్పర్సన్ తీపి రెడ్డి సావిత్రి మేఘారెడ్డి అన్నారు. మోత్కూరు ప్రజాభారతి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపువ్వు బతుకమ్మ అలంకరణ పోటీలలో విజేతలైన వారికి ఆదివారం స్థానిక గ్రంథాలయంలో బహుమతులను అందజేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సావిత్రి మాట్లాడుతూ  ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో బతుకమ్మ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీనరసింహారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా మన పండుగల ప్రాశస్యాన్ని నిలపడంలో భావితరాలకు వీటిని అందించడంలో స్థానిక ప్రజాభారతి చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఉపాధ్యక్షుడు బొల్లేపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న ,బొడ్డుపల్లి కళ్యాణ చక్రవర్తి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు దెబ్బేటి శైలజ, కో ఆప్షన్ సభ్యురాలు పి ఆనందమ్మ, ఇందిరా ప్రేమ జ్యోతి, మర్రి అనిల్ కుమార్ ,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీ మెగా రెడ్డి, ప్రజాభారతి అధ్యక్ష కార్యదర్శులు డి.అరవింద రా, గుమ్ముడేల్లి వెంకన్న, మాజీ కార్యదర్శి మర్రి జయశ్రీ ,గౌరవ అధ్యక్షులు ఎస్ఎన్ చారి, బయని రాజు ,బయ్యని వెంకటేశ్వర్లు, డబ్బేటి సోంబాబు ,చిలకమర్రి బాబు తదితరులు పాల్గొన్నారు.