పనులలో నాణ్యత లోపం లేకుండా జరగాలి: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

పనులలో నాణ్యత లోపం లేకుండా జరగాలి: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : సిసి రోడ్డు నిర్మాణం పనులలో నాణ్యత లోపం లేకుండా జరగాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలో సీసీ రోడ్ నిర్మాణ పనులను ఆయన పరిశీం చారు. పట్టణంలోని హైద్రాబాద్ చౌరస్తా నుండి జంఖాన్ గూడ చౌరస్తా వరకు నూతనంగా నిర్మించే సీసీ రోడ్ పనులను, అర్బన్ కాలనీ నూతన రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించి నాణ్యత లోపాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పెంట నరసింహ, గోమారు సుధాకర్ రెడ్డి లున్నారు.