కూర రాజన్న, అమర్ లను భేషరతుగా విడుదల చేయాలి......

కూర రాజన్న, అమర్ లను భేషరతుగా విడుదల చేయాలి......
  • సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్...

ఆలేరు (ముద్ర న్యూస్):సిపిఐ ఎంఎల్ జనశక్తి పార్టీ అగ్ర నాయకులు కూర రాజన్న. అమర్ లను ప్రభుత్వం భేషరతుగా విడుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి బెజాడి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మరియు జనశక్తి పార్టీ అగ్ర నాయకులు కూర రాజన్న. అమర్ లతో పాటు మరో నలుగురిని నల్లగొండ జిల్లా పోలీసులు కుక్కడం వద్ద అక్రమంగా అరెస్టు చేసి డిటిసి కి తరలించినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఆయన ప్రజా నాయకులను పోలీసులు అక్రమ అరెస్టు చేయడాన్ని తప్పు పట్టారు. వెంటనే ప్రభుత్వం మరియు పోలీసులు అక్రమ అరెస్టుపై స్పందించి వారిని కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకం చల్లగిల్లుతుందని అన్నారు.