రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలి-ఎస్పి రాజేంద్రప్రసాద్

రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలి-ఎస్పి రాజేంద్రప్రసాద్

జిల్లా పోలీస్ కార్యాలయం నందు రోడ్డు భద్రతపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట రోడ్డు ప్రమాదాల నివారణకు గాను సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు బుధవారం జాతీయ రహదారులు ఆనుకుని ఉన్న పోలీస్ స్టేషన్లు, సర్కిల్ అధికారులు, డిఎస్పి లతో జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, బ్లాక్ స్పాట్స్ వద్ద తక్షణ చర్యలు మొదలగు అంశాలపై ఎస్పీ  సమీక్ష నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ  ఏ సమయంలో ఏ వాహనాలు ఏ విధమైన ప్రమాదాలకు గురి అవుతున్నాయి అనేది గుర్తించి వాటి నివారణకు తీసుకోవాల్సిన అంశాలను ప్రనాలిక చేయాలని అన్నారు. బ్లాక్ స్పాట్స్ వద్ద, కీలకమైన కూడళ్ళ వద్ద లైటింగ్ పెంచాలని, చెట్ల పొదలు తొలగించాలని, ఇంజనీరింగ్ లోపాలు ఉంటే సవరించాలని ఇది నిత్యం చేయాల్సిన క్రియ అని తెలిపారు. తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్న ప్రదేశాల్లో ఇసుక సంచులు, వాటర్ క్యాన్స్ లాంటివి ఏర్పాటుకు అవకాశాలు చూడాలని సూచించారు. భారీకెడ్స్ ఏర్పాటు చేయడం లైట్ బ్లింకింగ్స్ ఏర్పాటు చేయడం స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఏర్పాటు చేయడం చేయాలని తెలిపారు. అలాగే జాతీయ రహదారి మీదకు వచ్చే అన్ని రోడ్లలో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో లేదో తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాలి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై నిత్యం కృషి చేయాలని ప్రమాదాల బారినప్పటి ఎవరు ప్రాణాలు పోకుండా చూడాలని ఎస్పీ  ఆదేశించారు. వాహనదారులను ప్రజలను అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్య పరచాలని తెలిపారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో డిఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్ రెడ్డి, రవి, CI లు సోమనారాయణ సింగ్, శ్రీనివాస్, నరసింహ, రాజశేఖర్, నాగార్జున, రాఘవలు, రాజేష్, రామలింగారెడ్డి, ప్రసాద్, SI లు, సిబ్బంది ఉన్నారు.