పట్టణ సీనియర్ ఫోటోగ్రాఫర్ సూర్యాపేట అసోసియేషన్ గౌరవ సలహాదారులు వాణి స్టూడియో సైదులు గారి పార్థివదేవానికి నివాళులర్పించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్

పట్టణ సీనియర్ ఫోటోగ్రాఫర్ సూర్యాపేట అసోసియేషన్ గౌరవ సలహాదారులు వాణి స్టూడియో సైదులు గారి పార్థివదేవానికి నివాళులర్పించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట పట్టణ సీనియర్ ఫోటోగ్రాఫర్ సైదులు అకాల మరణం చెందారు  వారి మరణం సూర్యాపేట పట్టణ ఫోటో వీడియో గ్రాఫర్ అసోసియేషన్ కి తీరని లోటని వారు ఎన్నో సంవత్సరాలుగా ఈ సూర్యాపేట పట్టణంలో ఫోటో స్టూడియో నడిపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వాణి స్టూడియో సైదులు వారు స్టూడియో నడిపించడమే కాకుండా అసోసియేషన్ బలోపేతానికి ఎంతో కృషి చేశారని ఎంతోమంది ఫోటోగ్రాఫర్లకు వర్క్ నేర్పించారని వారు నిబద్ధతతో కూడిన వ్యక్తిని సూర్యాపేటలో అందరికీ సుపరిచితుడుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ రంగంలో సేవలు అందిస్తూ ఫోటోగ్రఫీ రంగంలో ప్రతి ఒక్కరు తన కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి వాణి స్టూడియో సైదులు గారు అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోవడం ఫోటోగ్రఫీ రంగానికి తీరని లోటు అని వారి పార్థివదేహానికి  నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కూకుట్ల లాలయ్య , రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగూరు యాదగిరి , సీనియర్ ఫోటోగ్రాఫర్ వెంకట్ రెడ్డి  ,దుర్గా , విక్రమ్   శశి రెడ్డి , ఆర్ఆర్ ల్యాబ్ గిరి , శేఖర్ , సురేష్ , సూర్యాపేట పట్టణ ఫోటోగ్రాఫర్ పాల్గొన్నారు.