ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ తరపున 12 స్థానాలకు 130 మంది దరఖాస్తు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ తరపున 12 స్థానాలకు 130 మంది దరఖాస్తు
  • తుంగతుర్తి లో అత్యధికం 23 నాగార్జునసాగర్ లో అత్యల్పం 02
  • జిల్లాలో సగం స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయినట్టు సమాచారం
  • స్క్రీనింగ్ కమిటీ పరిశీలన అనంతరం సెప్టెంబర్ 2న ప్రకటించే అవకాశం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-రానున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఆగస్టు 25 తారీకు వరకు స్వీకరించిన దరఖాస్తులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు గాను 130 దరఖాస్తులు వచ్చినట్టు  గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. గాంధీభవన్లో టీపీసీసీ మంగళవారం జరిపిన అభ్యర్థుల ప్రాథమిక స్క్రీనింగ్ స్కూటీని అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు గాను ఆరు స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేశారని సమాచారం. తుంగతుర్తి ఎస్సి రిజర్వుడు స్థానానికి అత్యధికంగా 23 మంది దరఖాస్తు చేసుకోగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి అత్యల్పంగా ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా దరఖాస్తు చేస్తున్న వారి సంఖ్య పేర్లు ఈ విధంగా ఉన్నాయి.

నల్లగొండ నియోజక వర్గానికి మొత్తం ఏడు దరఖాస్తులు రాగా ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దుబ్బాక నర్సింహారెడ్డి డాక్టర్ చెరుకు సుధాకర్ తోపాటు మరో నలుగురు దరఖాస్తు చేసుకున్నారు.

దేవరకొండ నియోజకవర్గం మొత్తం పది మంది దరఖాస్తు చేసుకోగా మాజీ  ఎమ్మెల్యే బాలు నాయక్, బిల్యా నాయక్ తో పాటు మరో ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు.

మునుగోడు నియోజకవర్గానికి మొత్తం నాలుగు దరఖాస్తులు రాగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి స్రవంతి చల్లమల్ల కృష్ణారెడ్డి పున్న కైలాష్ నేత బైకని లింగయ్య యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు

భువనగిరి నియోజకవర్గం మొత్తం 11 దరఖాస్తులు రాగా సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పోత్నక్ ప్రమోద్ కుమార్. పంజాల రామాంజనేయులు గౌడ్ కసిరెడ్డి నరసింహారెడ్డిలతోపాటు మరో ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు

ఆలేరు నియోజకవర్గానికి మొత్తం 17 దరఖాస్తులు రాగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అందం సంజీవరెడ్డి బీర్ల ఐలయ్య బండ్రు శోభారాణి బోరెడ్డి అయోధ్య రెడ్డి కల్లూరి రామచంద్రారెడ్డి లతోపాటు మరో 12 మంది దరఖాస్తు చేసుకున్నారు.

నకిరేకల్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గానికి మొత్తం 18 దరఖాస్తులు రాగా సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే వేదాస్ వెంకయ్య టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య నలగొండ జడ్పిటిసి వంగూరి ఐలయ్య లతోపాటు మరో 15 మంది దరఖాస్తు చేసుకున్నారు

నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మొత్తం రెండు దరఖాస్తులు రాగా వారిద్దరు కూడా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారులు రఘువీర్ రెడ్డి జయవీర్ రెడ్డి లు దరఖాస్తు చేసుకున్నారు

మిర్యాలగూడ నియోజకవర్గానికి మొత్తం 20 దరఖాస్తుల రాగా మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి నలగొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లక్ష్మారెడ్డి (బీ ఎల్ ఆర్) గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి డి.ఎస్.పి నూకల వేణుగోపాల్ రెడ్డి లతోపాటు మరో 15 మంది దరఖాస్తు చేసుకున్నారు.

సూర్యాపేట నియోజకవర్గానికి మొత్తం ఆరు దరఖాస్తులు రాగా మాజీ మంత్రి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిసిసి మాజీ అధ్యక్షుడు తండు శ్రీనివాస్ యాదవ్ ముషం రవికుమార్ ఎలగందుల రాము లతోపాటు మరొకరు దరఖాస్తు చేసుకున్నారు.

కోదాడ నియోజకవర్గానికి మొత్తం ఐదు దరఖాస్తులు రాగా మాజీ ఎమ్మెల్యే నల్లమాడ ఉత్తం పద్మావతి రెడ్డి, ఎన్నారై అన్నపురెడ్డి అప్పిరెడ్డి సామల జయపాల్ రెడ్డి లతోపాటు మరో ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు

హుజూర్నగర్ నియోజకవర్గానికి మొత్తం ఏడు దరఖాస్తులు లాగా మాజీ టీపీసీసీ చీఫ్ నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిల్లుట్ల రఘు సామల శివారెడ్డి అల్లం ప్రభాకర్ రెడ్డి అన్నపురెడ్డి అప్పిరెడ్డి లతో పాటు మరో ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు

తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గానికి అత్యధికంగా టీ పి సి సి అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్ అన్నే పర్తి జ్ఞాన సుందర్ , కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం, ఓయూ ఉద్యమ నేత పిడమర్తి రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చివ్వెంల మాజీ జెడ్పిటిసి చింతమళ్ళ రమేష్ డాక్టర్ వడ్డేపల్లి రవి గుడిపాటి నరసయ్య, ప్రభుత్వ ఉద్యోగి కరుణ సాగర్ మమత లతో పాటు మరో 14 మంది దరఖాస్తు చేసుకున్నారు.

మొదటి స్క్రీనింగ్ లోనే సగం స్థానాలకు అభ్యర్థుల ఖరారు...?

మంగళవారం సాయంత్రం టి పి సి సి ఎన్నికల కోర్ కమిటీ అసెంబ్లీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించారు పలు రకాలుగా చేసిన అనంతరం ఎక్కువ పోటీ ఉన్న స్థానాలతో పాటు కొంచెం వివాదాస్పదంగా ఉన్న స్థానాలను తదుపరి స్క్రీనింగ్ చేయాలని ఆయా స్థానాల నుంచి ముగ్గురు పేర్లను  ఏఐసిసి కి పంపాలని నిశ్చయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసిన విశ్వసనీయ సమాచారం. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ సూర్యపేట కోదాడ హుజూర్నగర్ నాగార్జునసాగర్ మునుగోడు స్థానాలకు అభ్యర్థులు ఎవరైనా విషయంలో ఒక కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. సెప్టెంబర్ 2న ఈ మేరకు టీపీసీసీ ప్రకటించే మొదటి విడత 30 లేదా 40 స్థానాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి సగం స్థానాలు తప్పకుండా ఉంటాయని కాంగ్రెస్ తరపున పోటీ చేయాలనుకునే నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభ్యర్థులను ప్రకటించిన అనంతరం ఆశావాహులు ఆశ నిరాశల తదుపరి టికెట్ రానివారు కాంగ్రెస్ లోనే ఉంటారా ఇతర పార్టీలోకి వెళ్తారా అన్న అభిప్రాయాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అభ్యర్థుల ఖరారు అనంతరం మార్పులు చేర్పులు తోపాటు మరికొన్ని అనూహ్యా మార్పులు కాంగ్రెస్ పార్టీలో సంభవిస్తాయని సంకేతాలు వెలువడుతున్నట్టు రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.