బీజేపీ తరపున సూర్యాపేట అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్ధి గా ధరకాస్తు చేసిన బూర  మల్సూర్ గౌడ్

బీజేపీ తరపున సూర్యాపేట అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్ధి గా ధరకాస్తు చేసిన బూర  మల్సూర్ గౌడ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : బీజేపీ తరపున సూర్యాపేట అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్ధి గా బిజెపి రాష్ట్ర నాయకుడు మల్సూర్ గౌడ్  రాష్ట్ర బిజెపి కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా మల్సూర్ గౌడ్ మాట్లాడుతూ  బడుగు బలహీన వర్గాలకు అందు బాటలో ఉండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. సూర్యాపేట పట్టణ,మండల కేంద్రముతో పాటు నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో బీజేపి కేంద్ర నిధులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విరివిగా చేపట్టి నియోజకవర్గం ను అభివృద్ధిలో  అగ్రగామిగా చేస్తానని హామీ ఇచ్చారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అబిష్టం మేరకు నడుచుకుంటానని, బీసీ ఎస్సీ ఎస్టీ లు రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి బీజేపి పార్టి తరపున పోటీలో ఉండే తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మల్సూర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు