యువతకు అండగా ఏఐవైఎఫ్

యువతకు అండగా ఏఐవైఎఫ్
  • యువతను ఐక్యం చేసి పోరాటాలకు సన్నద్ధం కావాలి
  • సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: యువతకు అండగా అఖిల భారత యువజన సమాఖ్య ఎల్లప్పుడూ ఉంటుందని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా యువతను ఐక్యం చేసి పోరాటాలకు సన్నద్ధం చేయాలని  సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు ఏఐవైఎఫ్ జెండా ను ఎగురవేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని ఆదివారం  కామ్రేడ్ ధర్మభిక్షం కార్యాలయంలో ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి  బి.పి,నరేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య ద్వితీయ మహాసభ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన యువతను ఆదుకోవడంలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పాలకులు చర్యలు చేపట్టాలని అన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్, సుఖ్ దేవ్ ,రాజ్ గురు వంటి అనేకమంది మహానీయులు ప్రాణాలు తృణప్రాయంగా పెట్టి స్వాతంత్ర్య ఉద్యమం లో  పాల్గొన్నారని గుర్తు చేశారు.

ఇలాంటి వారిని యువత స్పూర్తి గా తీసుకోవాలని పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి వలనే యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి పెడదారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల అవలంబిస్తున్న యువజన, విద్యా ,వ్యతిరేక   విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని కోరారు. దేశ అభివృద్ధి లో యువత పాత్ర కీలకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలుకల శ్రీనివాస్, కార్యదర్శి చేపూరి కొండల్,సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ మాజీ నాయకులు ఖమ్మం పాటి రాము ,ఏఐఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని రవికుమార్, ఏఐటియుసి ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, పాషా,తదితరులు పాల్గొన్నారు.

ఏఐవైఎఫ్ పట్టణ నూతన కమిటీ ఎన్నిక
ఏఐవైఎఫ్ పట్టణ అద్యక్షులుగా బూర సైదులు, ప్రధాన కార్యదర్శి గా బి,పి,నరేష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా హరి ,తాళ్ల సైదులు, సహాయ కార్యదర్శులు గా నిమ్మల శేఖర్, ఐతగాని కామేష్,కోశాధికారి గా యడవెల్లి శ్రీకాంత్
కమిటీ సభ్యులు గా కప్పల రాము, దిండుగల సురేష్, డి, నాగరాజు, సుమన్, వడ్డే వెంకటయ్య, వాడపల్లి గోపి తదితరులు ఎన్నికైయ్యారు.