నిబంధనలకు లోబడి ఎన్నికల విధులు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా

నిబంధనలకు లోబడి ఎన్నికల విధులు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:
 సాధారణ ఎన్నికలు -2023 ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అధికారులు ఎన్నికల నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా శనివారం పాపన్నపేట మండలం మల్లంపేటలో  పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల సౌకర్యాలు, ఫారం 12 డి,  ఈ రోల్ వివరాలు అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...80 సంవత్సరాల పైబడిన వృద్ధులు పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓటు వేయలేని వారికి హోం ఓటింగ్ అవకాశం  కల్పించాలని, అలాగే పిఎస్ లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పిఎస్ లలో పిడబ్ల్యుడి ఓటర్ల కోసం వీల్ చైర్లు, ర్యాంపులు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

వారికి సదరన్ సర్టిఫికెట్ ఉండాలన్నారు. గల్లీ గల్లీకి వెళ్లి ప్రజలను ఒక చోట సమావేశ పరిచి అందరూ ధైర్యంగా ఓటును వినియోగించుకొనెలా బిఎల్ఓలు  ప్రజలను చైతన్య పరచాలని, ఓటు  వజ్రాయుధం లాంటిదని, మన భవిష్యత్తు తలరాతలు మార్చే ఓటును  ప్రలోభాలకు ప్రభావితం కాకుండ  పారదర్శకంగా  ఓటును వినియోగించుకొనేల చైతన్యపర్చాలని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే వారిపై. సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం మెదక్ మండలం మాచవరం ఎఫ్ఎస్టి బృందాల వాహనాలు తనిఖీ చేసే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. తనిఖీల్లో 50 వేల రూపాయలు, అంతకన్నా ఎక్కువ నగదు, సామాన్ల రూపంలో పదివేల రూపాయలు, ఆపైన విలువైన సామాన్లు సీజ్ చేయాలని, వాటిని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.  సంబంధిత వ్యక్తులు ఎన్నికల గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేయాలని, విచారణ అనంతరం  సరైన పత్రాలు సమర్పించి తిరిగి పొందవచ్చని తెలిపారు. పది లక్షల రూపాయలకు పైగా నగదు పట్టుబడితే ఇన్ కామ్ టాక్స్ అధికారులకు  తెలపాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రవాణా  చేస్తుంటే  సందేహాత్మకంగా ఉంటే వెంటనే సీజ్ చేయాలన్నారు. వీడియో రికార్డింగ్ తో పాటు రిజిస్టర్లో వాహనాలు వివరాలు నమోదు చేయాలన్నారు. వెంట మెదక్ ఆర్డిఓ అంబదాస్ రాజేశ్వర్, ఎన్నికల అధికారులు, బిఎల్వోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.