గిరిజనుల సౌలభ్యం కోసమే ప్రత్యేక తండాలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

గిరిజనుల సౌలభ్యం కోసమే ప్రత్యేక తండాలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

చిన్నశంకరంపేట, ముద్ర: గిరిజనుల సౌలభ్యం కోసమే  తండాలను ప్రత్యేక పంచాయతీలుగా  ఏర్పాటు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  శనివారం చిన్నశంకరపేట మండలంలోని మిర్జాపల్లి తండా, ఖాజాపూర్ తండాలను ఎమ్మెల్యే సందర్శించి, నూతన పంచాయతీ భవనాలకు ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనలు ఏనాడు పట్టించుకోలేదని  ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనులకు ప్రత్యేక  స్థానం దక్కిందన్నారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా  సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేశం గర్వించదగ్గ  కనివిని ఎరుగని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి విజయ శేఖర్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు,  సర్పంచులు బుచ్చమ్మ రాములు నాయక్, జంకు, శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, ఆయా గ్రామాల పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.