మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం

మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఎం.పద్మాదేవేందర్ రెడ్డి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 9వ వార్డులో ప్రచారం ప్రారంభించారు. వీధుల్లో పర్యటిస్తూ ఇంటింటా మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికి బొట్టుపెట్టి మద్దతు పలికారు. కెసిఆర్ సారథ్యంలో రాష్ట్రం, మెదక్ అభివృద్ధి చెందింది మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పద్మ దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వెంట మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్  మల్లికార్జున గౌడ్, పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్ మేడి కళ్యాణి మధుసూదన్ రావు, సుంకయ్య, దుర్గాప్రసాద్, మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం, సాయిలు, లింగారెడ్డి, నిఖిల్ తదితరులున్నారు.