రైతులకు పంట రుణాలపై అవగాహన

రైతులకు పంట రుణాలపై అవగాహన

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలి ఘన్పూర్ మండలం తొగిట గ్రామంలో శుక్రవారం రైతులకు పంట రుణాలపై అవగాహన కల్పించారు. రైతులు క్రమం తప్పకుండా రెన్యూవల్ చేసుకుంటే అధిక వడ్డీ భారం తగ్గుతుందని మండల వ్యవసాయ అధికారి నాగమాధురి సూచించారు. వ్యవసాయంలో పాటించాల్సిన మెళకువలు, అధిక దిగుబడి పొందడానికి పాటించవలసిన పద్ధతుల గురించి, మోగి పురుగు ఉధృతి తగ్గించడానికి పాటించాల్సిన చర్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాణిక్య రెడ్డి,  ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ సత్యగౌడ్, ఆత్మ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, శ్యామ్ కుమార్, మనోహర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.