మెదక్ లో కొనసాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర

మెదక్ లో కొనసాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర
  • ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి
  • భక్తులకు అల్పాహారం వితరణ
  • లడ్డు ధర రూ.1.63 లక్షలు

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభయాత్ర కొనసాగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత కూడా శోభాయాత్ర కొనసాగుతుండగా వినాయకుల ముందు బ్యాండు మేళా చప్పుళ్ల మధ్య యువకులు నృత్యాలతో, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. రాందాస్ చౌరస్తాలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక నుండి శోభాయాత్రలో ముందుకు సాగివచ్చిన వినాయకులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మున్సిపల్ జ్ఞాపికను అందజేశారు.

ప్రజలకు అల్పాహార వితరణ
మెదక్ పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవం సందర్బంగా రాందాస్ చౌరస్తాలో అల్పాహారం వితరణ చేశారు. పట్టణ కిరాణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వితరణ ప్రారంభించారు. అల్పాహార దాతలను అభినందించారు. వెంట మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు, కిర