వైభవంగా శ్రీనివాస పద్మావతి కల్యాణం

వైభవంగా శ్రీనివాస పద్మావతి కల్యాణం

ముద్ర ప్రతినిధి:మెదక్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీనివాస పద్మావతి కల్యాణోత్సవం వైభవోపేతంగా వేద బ్రహ్మణోత్తములు నిర్వహించారు. ఈ సందర్బంగా 
సుప్రబాత సేవ,  బలిహరణము, ఆరగింపు, తీర్థ ప్రసాదం, గోపినిత్యహోమము, బలిహరణము అనంతరం ఎదుర్కోళ్ళు నిర్వహించారు. 
భక్తుల జయజయద్వానాల మధ్య కల్యాణం అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్బంగా భక్తులు శోభాయాత్ర ఘనంగా నిర్వహించగా మహిళలు, భక్తులు భజన పాటలు ఆలపించారు.