ఆర్ఓ, చెక్ పోస్టులు సందర్శించిన వ్యయ పరిశీలకులు సంజయ్ కుమార్ 

ఆర్ఓ, చెక్ పోస్టులు సందర్శించిన వ్యయ పరిశీలకులు సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ నియోజక వర్గం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి  కార్యాలయం వ్యయ పరిశీలకులు సంజయ్ కుమార్ ఆదివారం పరిశీలించారు.అభ్యర్థి వ్యయ వివరాలు పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు నామినేషన్ వేసినప్పటి నుంచే ఖర్చులను లెక్కలోకి తీసుకోవాలని, ప్రతి అభ్యర్ధి  బ్యాంక్ కొత్త అకౌంట్ ఖాతా తెరవాలని సూచించారు. అకౌంటింగ్ టీంలకు తగు సూచనలు సలహాలు అందించారు.

అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెంచాలని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉన్నవసతులు, సదుపాయాలను, కార్యాలయంలో ఏర్పాటు చేసిన  టి.వి మానిటరింగ్ విధానాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో  లైజన్ అధికారి జిల్లా పరిశ్రమల శాఖ  జి.ఎం.కృష్ణ మూర్తి, రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ  అంబదాస్ రాజేశ్వర్,  అకౌంటింగ్ టీం, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.అలాగే కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను దామర చెరువు వద్ద వ్యయ పరిశీలకులు సందర్శించారు.