ప్రతి ఓటర్ కి స్లిప్, గైడ్, సి-విజిల్ కరపత్రాలు 

ప్రతి ఓటర్ కి స్లిప్, గైడ్, సి-విజిల్ కరపత్రాలు 
  • జిల్లా జిల్లా కలెక్టర్  రాజర్షి షా 

ముద్ర ప్రతినిధి, మెదక్:సాధారణ ఎన్నికల్లో భాగంగా   మెదక్  పట్టణం దాయరలో  కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా ఓటర్ సమాచార స్లిప్ పంపిణీ  కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలింగ్ డేకి 13 రోజులు  మాత్రమే మిగిలి ఉన్నాయని, బిఎల్ఓలు, సూపర్ వైజర్లు ప్రతి ఇంటికి  తిరిగి ఓటర్ సమాచార స్లిప్ పంపిణీ  చేయాలన్నారు. ఈ నెల 22 వరకు,  రోజు వారీగా 200 ఓటర్ సమాచార స్లిప్  పంపిణీ చేస్తే   త్వరితగతిన  పంపిణీ పూర్తవుతుందని తెలిపారు.  దాయర కాలనీలో  పోలింగ్ కేంద్రం 141 లోని  ఓటర్లకు ఓటర్ సమాచార స్లిప్  అందించారు.

ఓటర్ స్లిప్ తోపాటు, ఓటర్  గైడ్, సి-విజిల్ కరపత్రాలు ప్రతి ఓటర్ కి  అందాలని ఆదేశించారు.  ఓటు హక్కు వున్నా ప్రతి  వ్యక్తికి   ఓటర్ సమాచార స్లిప్ అందించాలని, ఓటర్  అందుబాటులో లేకపోతె  కుటుంబసభ్యులకు మాత్రమే అందించాలని, ఒకరి స్లిప్ల్ లు వేరొకరికి అందించవద్దని బిఎల్ఓలు, సూపర్ వైజర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  తహసీల్దార్ శ్రీనివాస్, బిఎల్ఓ  మాధవి,  సిబ్బంధిపాల్గొన్నారు.