ఉద్యాన పంటలపై అవగాహన కలిగించాలి

ఉద్యాన పంటలపై అవగాహన కలిగించాలి
  • టిఎలకు డిఆర్డిఓ శ్రీనివాస్ సూచన

ముద్ర ప్రతినిధి, మెదక్:రైతులు ఉద్యాన పంటలపై దృష్టి సారించేలా చూడాలని డిఆర్డిఓ శ్రీనివాస్ సూచించారు.బుధవారం ఉపాధి హామీ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, సాంకేతిక సహాయకులకు హార్టికల్చర్ ప్లాంటేషన్ పై వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లాలో  1,542 ఎకరాలలో ఉద్యాన పంటలు, ఆయిల్ ఫామ్ పంటలు పండించాలన్నది లక్ష్యం అన్నారు. రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కలిగించాలని సూచించారు. మండలానికి వంద ఎకరాల లక్ష్యంగా ఉద్యాన పంటలు పండించాలని  ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించాలని, 5 ఎకరాలలోపు ఉన్న రైతులను గుర్తించి ఉద్యాన పంటలు ఏర్పాటు చేసుకొనుటకు ప్రోత్సహించాలన్నారు. ఎస్సి, ఎస్టీలకు ప్రభుత్వం వంద శాతం, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం  రాయితీ కల్పిస్తుందని, అయితే  జి.ఎస్.టి. అదనంగా చెల్లించవలసి ఉంటుందని అన్నారు. ఆసక్తి గల  ఈ నెల 31 వరకు  ఉద్యాన, వ్యవసాయ శాఖాధికారులవద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. హరిత హారంలో భాగంగా సింగరేణి ప్రాంతంలో మాదిరిగా బండ్ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ చేయాలని తెలిపారు.