మత్తల్లు దూకుతున్న చెరువులు

మత్తల్లు దూకుతున్న చెరువులు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: గత నాలుగు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనగామ జిల్లా చిల్పూర్, స్టేషన్ ఘన్ పూర్ మండలాల్లోని చెరువులు, కుంటల్లోకి సమృద్ధిగా నీరు చేరి మత్తల్లు దూకుతున్నాయి.

రెండు మండలాల పరిధిలో ఉన్న మల్లన్న గండి రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతుండగా నష్కల్ చెక్ డాం, మల్కాపూర్ పెద్ద చెరువు, పల్లగుట్ట, కృష్ణాజి గూడెం గ్రామాల్లోని కుంటలు చెరువులు మత్తల్లు పోస్తున్నాయి. స్టేషన్ ఘన్ పూర్ మండలంలో 82 కుంటలు చెరువులు ఉండదు తాటికొండ లోని వల్లబరాయిని చెరువు, నమిలికొండ పెద్ద చెరువు, తానేదార్ పల్లి, మీదికొండ, కొత్తపల్లి తదితర గ్రామాల్లోని చెరువులు కుంటలు మత్తడి పడుతున్నాయి. విశ్రాంతంగా పడుతున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రజలను కోరుతున్నారు.