ఎస్టి హాస్టల్లో వసతులు కనిపించాలి

ఎస్టి హాస్టల్లో వసతులు కనిపించాలి

ముద్ర ప్రతినిధి భువనగిరి : ఎస్టి హాస్టల్లో వసతులు కనిపించాలని టీఎన్ఎస్ఎఫ్ భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు ఆరెపల్లి రాము డిమాండ్ చేశారు. బుధవారం  టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో  భువనగిరి పట్టణంలోని ఎస్టి హాస్టల్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో 60 మంది విద్యార్థులు 3కేజీ అన్నం, లీటర్ సాంబార్ రెండు, కిలోల బెండకాయ కూర, కారంపొడి పెడుతున్నారని చెప్పారు. విద్యార్థులకు చాలీచాలని అన్నం, కూర పెడుతున్నారని విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని వార్డెన్ ని ఫోన్ చేసి అడగ్గా నాకు బిల్లు వస్తలేదు మేము అలానే పెడతాం అంటు సమాధానం ఇచ్చినట్టు చెప్పారు. బాత్రూంలు నీటుగా ఉంటలేవు అని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులకు సంబంధించిన మెనూ వస్తువులు బియ్యం, పప్పు గ్యాస్ బయట అమ్ముకుంటున్నారని చెప్పారు. విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాటూరి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సిద్ధగోని ధనంజయ గౌడ్, సైదులు, సాయి చరణ్ పాల్గొన్నారు.