రాజ్యాంగము - పౌరుల హక్కులు - విధులు అంశంపై స్ఫూర్తిని నింపటానికి బైక్ ర్యాలీ 

రాజ్యాంగము - పౌరుల హక్కులు - విధులు అంశంపై స్ఫూర్తిని నింపటానికి బైక్ ర్యాలీ 

ర్యాలీలో పాల్గొన్న జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, న్యాయవాదుల సంఘం

 భువనగిరి ముద్ర న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, డా.  బి. ఆర్. అంబేద్కర్ జయంతి ఈ నెల 14 న పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, యదాద్రి భువనగిరి మరియు భువనగిరి న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలకు రాజ్యాంగము - పౌరుల హక్కులు - విధులు అంశంపై స్ఫూర్తిని నింపటానికి మరియు అవగాహన కలిగించటానికి న్యాయ చైతన్య కార్యాక్రమమును బైక్ ర్యాలీ ద్వారా బుధవారం  ఉదయం 8.00 గం. లకు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బాల భాస్కర్ రావు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంబించారు. ముందుగా డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రా పటానికి పూలమాల వేసి వందనాలు సమర్పించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ భారతదేశం అత్యున్నత మేధావులకు పుట్టినిల్లని ఈ అత్యున్నత మేధావులలో డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ  ఒక గొప్ప విద్యావేత్త, సామాజికవేత్త, సంఘ సంస్కర్తఅని , మన దేశం గణతంత్ర దేశంగా వర్దీళ్ళటానికి వారు రచించిన రాజ్యాంగమేనని, ఈనాడు మనము ఈ స్వేచ్చా హక్కులను పరిపుష్టిగా సాధించుకొంటున్నామంటే వారి కృషీ పళితమేనని, రాజ్యాంగము పట్ల ప్రతి పౌరుడు విధిగా పూర్తి అవగాహన కలిగి ఉండానాలని, హక్కుల సాధనే కాకుండా ప్రాథమిక విధులను నిర్వర్తించినప్పుడే నిజమైన పౌరుడుగా నిర్వచింపబడుతాడని, ఇన్ని చట్టాలకు, మనిషి సంఘజీవిగా క్రమశిక్షణతో జీవించటానికి ఎన్నో చట్టాలు రూపొందించబడ్డాయని , ఆ చట్టాలు , ఈ న్యాయ సేవ సంస్థ అధికార చట్టం అన్నింటికి మూలం డా.బి.ఆర్.అంబేడ్కర్ మన జాతికి ఇచ్చిన రాజ్యాంగమే అని తెలిపారు. ప్రతీ పౌరుడు రాజ్యాంగం పట్ల , విధుల పట్ల స్ఫూర్తిని పొంది చట్టం ప్రకారం నడుచుకోవాలని పిలుపు ఇవ్వటానికి, ప్రతీ ఒక్కరికీ చైతన్యం కలిగించటానికె  ఈ ర్యాలి  నిర్వహించామని  తెలిపారు.

ఈ బైక్ ర్యాలిని భువనగిరి కోర్టు నుండి యాదగిరిగుట్ట దాకా న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు యంత్రాంగము పాల్గొని , ప్రజలకు రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, విధులపై మైక్ అనౌన్సుతో తెలుపుతూ మరియు హక్కులు, విధులతో తయారు చేసిన ప్లకార్డ్స్ ను ప్రదర్శించారు. కార్యాక్రమములో క్రమములో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ భువనగిరి కోర్టు నుండి రాయగిరి x రోడ్స్ వరకు నిర్వహించబడుతుంది . ఈ కార్యాక్రమములో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ప్రధాన సీనియర్ సివిల్ జడ్జ్ కె దశరథ రామయ్య, జూనియర్ సివిల్ జడ్జ్ డి. నాగేశ్వర రావు, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మరియు ప్రభుత్వ న్యాయవాది నాగారపు అంజయ్య, కార్యదర్శి సి.హెచ్.రాజశేఖర్ రెడ్డి, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ రెడ్డి, సబ్ కోర్టు పి.పి. జి. స్వామి, సహాయ ప్రభుత్వ న్యాయవాది బి. కేశవ రెడ్డి,   ట్రాఫిక్ సి.ఐలు సతీష్, జితేందర్ రెడ్డి, వెంకటేష్ మరియు పోలీసు యంత్రాంగం, డిప్యూటి లీగల్ అయిడ్ కౌంసెల్ జి. శంకర్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కార్యాక్రమములో పాల్గొన్నారు.