సర్వమత సమానత్వమే ప్రభుత్వ లక్ష్యం -  మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

సర్వమత సమానత్వమే ప్రభుత్వ లక్ష్యం -  మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణాలో అన్ని మతాలకు సమాన ఆదరణ ఉందని, అన్ని వర్గాల సంక్షేమం కోసమే ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణం లోని  అంబేద్కర్  భవన్ లో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో  అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,  జిల్లా పాలనాధికారి  వరుణ్ రెడ్డి తో కలసి బుధవారం రంజాన్ కానుకలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో  జరుపుకోవాలని  అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం  పేద ప్రజలు పండుగను  ఘనంగా నిర్వహించుకునేందుకు  కానుకలను  అందజేస్తున్నదని  తెలిపారు.నియోజకవర్గాల వారిగా  మొత్తం  ఆరువేల గిఫ్ట్ ప్యాక్స్ వచ్చాయని,నిర్మల్  కు 2000,  ముధోల్ కు 2500,  ఖానాపూర్ కు 1500 కేటాయించామని అన్నారు.అనంతరం నిర్మల్   నియోజకవర్గం  పేద ముస్లింలకు దుస్తులు  అందజేశారు. ఈద్గా పనులు పరిశీలించిన మంత్రి అంతకుముందు నూతనంగా నిర్మిస్తున్న ఈద్గా ను  జిల్లా పాలనాధికారి తో కలసి మంత్రి సందర్శించారు. నూతనంగా  నిర్మిస్తున్న ఈద్గా పనులను  పరిశీలించి రంజాన్ పండుగ రోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నట్లు  తెలిపారు.ఈ కార్యక్రమాల్లో  అదనపు కలెక్టర్  రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఆర్డీవో స్రవంతి, తహశీల్దార్లు సుభాష్ చందర్, ప్రభాకర్,  ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.