తెలంగాణలో ఏ చెయ్యి, ఏ మెదడు ఖాళీ లేదు ..

తెలంగాణలో ఏ చెయ్యి, ఏ మెదడు ఖాళీ లేదు ..
  • కేంద్రంలో నూతన వ్యవసాయ కళాశాల భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
  • వ్యవసాయ విద్యను అభ్యసించడంలో బాలికలు ముందున్నారు
  • వ్యవసాయ విద్యకు ఉజ్వల భవిష్యత్
  • భిన్నమైన కోర్సులతో భిన్నమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: వ్యవసాయ రంగం, భీమా రంగం, బ్యాంకింగ్ రంగం, ప్రాసెసింగ్ రంగం, విత్తనరంగాలలో అనేక అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో ఏ చెయ్యి, ఏ మెదడు ఖాళీ లేదు .. 9 ఏళ్లలో అందరికీ ఉపాధి ఇచ్చే స్థాయికి తెలంగాణ ఎదిగింది భవిష్యత్ మరింత ఉన్నతంగా ఉండబోతుంది తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి బీఎస్సీ వ్యవసాయ కళాశాల పాలెంలో ఏర్పాటు చేసుకున్నాంవచ్చే విద్యా సంవత్సరం నుండి పీజీ కళాశాల ఏర్పాటుకు కృషివ్యవసాయ రంగం రెండు సవాళ్లు ఉన్నాయి ఒకటి ప్రపంచ జనాభాకు పౌష్టికాహారం అందించడం ఒక సవాల్ రెండవది ప్రపంచవ్యాప్తంగా భూ వాతావరణంలో వస్తున్న పెను మార్పులను నిలదొక్కుకుని వ్యవసాయ రంగం మనుగడ సాగించడంఒకప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన కొత్త లో జనాభాకు రెండు పూటలా తిండిలేని పరిస్థితి .. ఏటా లక్షల మంది చనిపోయిన దుస్థితి దేశంలో అనేక వ్యవసాయ పరిశోధన సంస్థలను నెలకొల్పి వ్యవసాయాన్ని సుస్థిరం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ ప్రజల ఆకలిని తీర్చడం ప్రథమ కర్తవ్యంగా ఆయన పనిచేశారు ఆ దశ దాటి దేశం ప్రస్తుతం అవసరానికి మించిన ఉత్పత్తులు సాధించి పంటల సమతుల్యత లోపించి ఇబ్బందులు పడుతున్నది అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల కాలనీలుగా విభజించి పంటలసాగును ప్రోత్సహిస్తే ఏ విధమైన ఆహార కొరత ఉండదు.

విదేశాలకు ఎగుమతులు పెంచవచ్చు అని చెబుతున్నారు ఆహారం మాత్రమే కాదు శక్తిని ఇచ్చే పౌష్టికాహారం దేశంలోని ప్రజలకు అందేలా వ్యవసాయం స్థిరపడాలి .. బలపడాలివ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది లేకుంటే మరో 50 ఏళ్ల తర్వాత ఈ భూమి మీద పంటలు పండే ఆస్కారం ఉండదు .. గణనీయంగా దిగుబడులు తగ్గిపోతాయి ఈ దరిత్రిని కాపాడుకోకుంటే భవిష్యత్ లో ప్రపంచంలో ఆహార కొరత ఏర్పడుతుంది హైదరాబాద్ లో జరిగే జీ20 సదస్సులో ఈ అంశాలపై ప్రధానంగా చర్చకు రానున్నాయి ఉత్పత్తిలో, ఐటీలో, సేవారంగంలో, మంచినీళ్లలో, సాగునీళ్లలో అన్ని రంగాలలో దేశంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందున్నది పంటల మార్పిడి మీద మరింత దృష్టి సారించాలి .. మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచాలి వ్యవసాయంలో సాంప్రదాయ పద్దతులను విడనాడాలి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయరంగంలో రాణించాలి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు మూలంగా విస్తృతంగా ఉపాధి అవకాశాలు రానున్నాయి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాలలో ఉపాధి అవకాశాలు వస్తాయిఈ రాష్ట్రానికి, దేశానికి వ్యవసాయ కళాశాలలు అత్యవసరం  కేంద్రంలో నూతన వ్యవసాయ కళాశా హాజరైన ఎంపీ పోతుగంటి రాములు , ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి.