జిల్లా అధికార యంత్రాంగంతో వ్యవసాయ శాఖ మంత్రి టెలికాన్ఫరెన్స్

జిల్లా అధికార యంత్రాంగంతో వ్యవసాయ శాఖ మంత్రి టెలికాన్ఫరెన్స్

 సిద్దిపేట : ముద్ర ప్రతినిధి నకిలీ విత్తనాల చెలామణిని ఉక్కుపాదంతో అణచివేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి జిల్లా అధికారులకు సూచించారు.రాష్ట్ర డీ.జీ.పీ అంజనీకుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వానాకాలం సీజన్ ను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి  రాష్ట్రంలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలని సూచించారు. అత్యంత ప్రాధాన్యత గల రంగం  వ్యవసాయ రంగం. దేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా  కోట్ల మందికి ఉపాధి కల్పించే రంగ వ్యవసాయ రంగం.

 తెలంగాణ సాధించిన 9 ఏండ్ల  కాలంలో ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు, సబ్సిడీతో ఎరువులు, విత్తనాల సరఫరా తదితర రైతు సంక్షేమ కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా  తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల 50 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. దాని ఫలితంగానే తెలంగాణలో ఉత్పత్తి ఉత్పాదకత పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. ప్రకృతి సైతం రైతులకు అనుకూలించిందని అన్నారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అధికారులు అంకితభావంతో.దేశ వ్యాప్తంగా అవసరమైన విత్తనాలలో 60% విత్తనాలను తెలంగాణ నుంచి అందిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్కమిషనర్ ఆప్ పోలిస్ శ్యేత, అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్,  వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ  అధికారులు తదితరులు పాల్గొన్నారు.