వడ్ల కొనుగోలుకు 200 సెంటర్లు – అడిషనల్‌ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

వడ్ల కొనుగోలుకు 200 సెంటర్లు – అడిషనల్‌ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

ముద్ర ప్రతినిధి, జనగామ : యాసంగి సీజన్‌ వడ్ల కొనుగోలుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాల సిద్ధంగా ఉండాలని అడిషనల్‌ కలెక్టర్ ప్రపుల్‌ దేశాయ్‌ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన  చాంబర్‌‌లో ధాన్యం కొనుగోలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2022–-23 యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో  111, ప్రాథమిక సహకార సొసైటీల ఆధ్వర్యంలో 89 మొత్తం 200 సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

జిల్లాలో 30.25 లక్షల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయా సెంటర్లలో కావాల్సిన సౌకర్యాలు వేయింగ్ మిషన్లు, టార్పాలిన్లు, గన్నీసంచులు, మ్యాచర్ మీటర్స్, ప్యాడి క్లీనర్లు తదితర ఏర్పాటు చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ సీజన్‌లో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చునని అంచనా వేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో డీఆర్డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రామ్ రెడ్డి, డీసీవో కిరణ్ కుమార్, డీసీ ఎస్ఓ ఎం.రోజారాణి, డీఎం మార్కెటింగ్ నాగేశ్వర శర్మ, డీఎం సివిల్ సప్లై సంధ్యారాణి పాల్గొన్నారు.